ప్రశ్న:
మన రూపాయికి, అమెరికా డాలరుకు సుమారు 50 రెట్ల తేడా ఉంటుంది. ఎందుకని?
జవాబు:
మనం వాడే డబ్బునే తీసుకుంటే ఒక రూపాయికి, ఐదు రూపాయలకి తేడా ఎందుకు ఉంది? ఐదు రూపాయలకి 10 చాక్లెట్లు వస్తాయనుకుంటే, అవే చాక్లెట్లు రూపాయకి రెండే వస్తాయి. పది చాక్లెట్లకి, రెండు చాక్లెట్లకి ఉన్న నిష్పత్తి 5 కదా. అదే రూపాయికి, ఐదురూపాయలకి ఉన్న నిష్పత్తి కూడా. అంటే మనం ఇచ్చే నాణెం విలువను వస్తువులను పొందే నిష్పత్తే నిర్ణయిస్తోంది.
అలాగే వివిధ దేశాల కరెన్సీ విలువలను వాటికి లభించే వస్తువుల నిష్పత్తే నిర్ణయిస్తుంది. అంతర్జాతీయంగా వినిమయం అయ్యే వస్తువుల విలువను బట్టే వివిధ దేశాల కరెన్సీ విలువ నిర్ణయమవుతుంది. ఉదాహరణకు మనం వాడే 50 రూపాయలకు అంతర్జాతీయ మార్కెట్లో ఒక వస్తువు లభిస్తుందనుకుందాం. అదే వస్తువును అమెరికా వ్యక్తి కొనాలంటే ఒక డాలరు ఇస్తే సరిపోతుందనుకుంటే, అప్పుడు డాలరు విలువ 50 రూపాయలవుతుందన్నమాట. వస్తువుల ధరల్లో తేడాపాడాలను బట్టి డాలరుకు, రూపాయికి మధ్య మారకపు విలువలో తేడాలు ఏర్పడుతాయి.
- =======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...