Showing posts with label what is the speed of Electricity in wires?. Show all posts
Showing posts with label what is the speed of Electricity in wires?. Show all posts

Wednesday, April 17, 2013

what is the speed of Electricity in wires?,తీగల్లో విద్యుత్‌ ఎంత వేగంతో వెళుతుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: తీగల్లో విద్యుత్‌ ఎంత వేగంతో వెళుతుంది?

జవాబు: తీగల్లో విద్యుత్‌ ప్రవాహం గురించి రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. తీగ నిడివి A,B అనే చివర్ల (Terminals) మధ్య ఉందనుకుందాం. అపుడు A వైపు రుణ ధృవం (Negative pole), B దగ్గర ధన ధృవం (+Ve pole) ఉండేలా ఏదైనా ఒక బ్యాటరీని సంధానించారనుకుందాం. అపుడు Aనుంచి B వైపునకు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. అయితే Aదగ్గర బయల్దేరిన ఎలక్ట్రాన్లుB వైపునకు నికరంగా చేరడానికి నిజంగానే కొంత సమయం పడుతుంది. ఎంత సమయం అన్న విషయం ఆ తీగకు ఉన్న విద్యన్నిరోధం (Electrical Resistance) పై ఆధారపడి ఉంటుంది. అయితే Aదగ్గర ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలయిందన్న సంకేతం మాత్రం కాంతి వేగమంత వెనువెంటనే తెలుస్తుంది. అందుకే B దగ్గర ఏదైనా విద్యుద్దీపం (Light) ఉన్నట్లయితే వెంటనే వెలుగుతుంది. కానీ A దగ్గర్నించి Bదగ్గరికి ఎలక్ట్రాన్లు చేరడాన్ని విద్యుత్ప్రవాహం (Current) అంటారు. ఇది కాంతి వేగానికి సమానం కాదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

   
  •  ==================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-