Showing posts with label కారు చక్రాల మాయ ఏమిటి?. Show all posts
Showing posts with label కారు చక్రాల మాయ ఏమిటి?. Show all posts

Sunday, March 08, 2009

కారు చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి ఏమిటి?, Car wheels appears Running back Why?

  • ప్రశ్న: కారు, బస్సు వేగంగా వెళ్తునప్పుడు చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఎందుకు?



సినిమాల్లో కార్లు వేగంగా వెళ్ళే దృశ్యం చూస్తున్నపుడు , కారు చక్రాలు మొదట్లో ఒక దిశలో తిరిగి మల్లి వెనక్కు తరిగినట్లు కనిపిస్తాయి . ఎందువల్ల ?
కారణం ... మన దృష్టి పై కాంతి ప్రదర్చించే ఒక భ్రమ . కారు చక్రాలు తిరుగుతున్నప్పుడు ఆ భ్రమనానికి కొంత పౌన:పుణ్యం (frequency) ఉంటుంది . భ్రమణం/పౌన:పుణ్యం అంటే ... ఒక సెకనుకు కారు చక్రాలు ఎన్ని భ్రమనాలు (turns) చేస్తున్నాయనే సంఖ్య . .. ప్రోజక్తర్ లో రీలు వేగంగా తిరగడం వల్ల తేరా మీద ఒక దాని తర్వాత ఇఒకటిగా నిశ్చల చిత్రాలు చక చక మారి మనకు దృశ్యం కదులు టున్న భ్రమ కలుగుతుంది . ఆ విదంగా సినిమా తేరా మీద పడే ఫిల్మ్ ప్రతిబింబలకు కుడా పౌన:పుణ్యం ఉంటుందన్నమాట . అంటే తెరపై సెకనుకు ఎన్ని చిత్రాలు పడుతున్నయనే (విక్షేపం )సంఖ్యే అది .
మాములుగా సినిమా తెరపై సెకనుకు 24 ఫిల్మ్లు విక్షేపం(appear) అవుతాయి . ఫిల్మ్ లోని Car చక్రాల భ్రమణాలు సెకనుకు 24 కన్నా తక్కువ ఉంటే Car చక్రాలు వెనుకకు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది . Car బయల్దేరినపుడు దాని వేగం తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా కనబడుతుంది .Car చక్రాల భ్రమణ పౌ న: పుణ్యం సరగ్గా 24 అయితే చక్రాలు తిరగ కుండా నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తాయి . కారు వేగం ఎక్కువయ్యే కొలదీ చక్రాలు తిరిగే frequency 24 కంటే ఎక్కువవడం వల్ల అవి దిశను మార్చి ముందుకు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తాయి . అంటే కారు చక్రాలు మొదట్లో వెనక్కు తిరిగి తర్వాత కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉంది అ తర్వాత ముందుకు తితుగుతున్నట్లు అనిపిస్తుంది .
పోన్:పుణ్యాల తేడాల వల్ల కలిగే ఈ వింత దృశ్య ఫలితాన్ని భౌతిక శాస్త్రం లో " Stroboscopic effect " అంటారు .


  • ================================
Visit my website : Dr.seshagirirao.com