Showing posts with label మంచుగడ్డ నుంచి పొగలెందుకు వస్తాయి?. Show all posts
Showing posts with label మంచుగడ్డ నుంచి పొగలెందుకు వస్తాయి?. Show all posts

Sunday, January 05, 2014

Smoke comes from outside kept Ice cubes.why?,మంచుగడ్డ నుంచి పొగలెందుకు వస్తాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: పెద్ద మంచుగడ్డను ఆరుబయట ఉంచితే దాని నుంచి పొగలెందుకు వస్తాయి?

జవాబు: ఆరుబయట గాలిలో పెట్టిన మంచుగడ్డ నుంచి వచ్చే పొగలు మంట నుంచి వెలువడే పొగల లాంటివో, ఏ వాయువుకో సంబంధించినవో కావు. మంచుగడ్డ చుట్టూ ఉన్న చల్లని గాలిలో ఘనీభవించిన నీటి ఆవిరే మనకలా పొగల రూపంలో కనిపిస్తుంది.

మంచుగడ్డ చుట్టూ ఉన్న గాలి బాగా చల్లబడి అతి తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఆ గాలిలో ఉన్న నీటి ఆవిరిలో కొంత ఘనీభవించి అతి సూక్ష్మమైన నీటి బిందువులు ఏర్పడతాయి. వాతావరణంలో సూర్యరశ్మికి వేడెక్కే గాలులు తేలికై పైకి ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ గాలులతోపాటుగా మంచుగడ్డ చుట్టూ ఏర్పడిన సూక్ష్మ నీటి బిందువులు కూడా పైకి లేస్తాయి. ఆ ప్రదేశాన్ని మంచుగడ్డకు దూరంగా ఉన్న గాలి ఆక్రమిస్తుంది. తిరిగి ఈ గాలి కూడా మంచుగడ్డ వల్ల చల్లబడి సూక్ష్మ బిందువులుగా మారి ఇతర గాలులతోపాటు పైకి లేస్తుంది. ఇలా పైకి లేచే అత్యంత సూక్ష్మమైన నీటి బిందువులే మనకు దట్టమైన పొగలలాగా కనిపిస్తాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ==============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-