ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్రశ్న : పాము తనని తాము కాటు వేసుకుంటే అది చనిపోతుందా?
జవాబు: పాము తనను తాను కాటు వేసుకున్నా,లేక అది వేరే పామును కాటు వేసినా ఏమీ కాదు.కాని ఇతర ప్రాణులపై(ముంగిస మినహాయింపు) మాత్రం దాని ప్రభావం ఉంటుంది.పాము విషం అనేది సక్లిష్టమైన పాలీపెప్టైడు లతో మరియు ఎంజైములతో కూడిన ఒక ప్రోటీన్.ఈ విషం మూడు రకాలు.సైటో టాక్సిన్-ఇది కణాలను నేరుగా చంపేస్తుంది,హీమోటాక్సిన్-ఇది రక్తం గడ్డకట్టే వ్యవస్థను నాశనం చేస్తుంది,న్యూరో టాక్సిన్-శరీర కండరాలలో ఉండే అసిటైల్ కోలిన్ అనే రసానాన్ని నిరోధిస్తుంది,తద్వారా కండరాలన్ని చచ్చుబడి (Paralysis) పోతాయి.ఈ విధంగా పాము విషం శరీరంపై పనిచేయడం వల్ల జీవులు మరణిస్తాయి.ఐతే విచిత్రంగా పాము,ముంగిస లాంటి వాటి శరీరంలో ప్రత్యేకమైన వ్యవస్థ నిర్మితమై ఉంటుంది.వాటిలో విషప్రభావంకు గురయ్యే Receptors లేకపోవడం వలన ఆ విషం ఏమీ చేయదు.
- =================================