Showing posts with label కంటిరెప్పలు అదురుతాయెందుకు ?. Show all posts
Showing posts with label కంటిరెప్పలు అదురుతాయెందుకు ?. Show all posts

Friday, September 02, 2011

కంటిరెప్పలు అదురుతాయెందుకు ?, Eye lids blinks automatically- Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

కంటిని ఆవరించుకొని ... బయట (external) , లోపల (internal) కండరాలు అమరి ఉంటాయి . లోపల కండరాలు కంటి ఫోకస్ ని , ప్యూపిల్ సైజ్ ని కంట్రోల్ చేస్తాయి . బయట కండరాలు కన్ను చూసే వస్తువుల దిశానిర్దేశాలను , వస్తువును నిత్యమూ కదెలే స్థితి ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి . కంటి నరాలలో కలిగే అసంకల్పిత ప్రతీకార చర్యవలన కనురెప్పలు అదురుతాయి . దీనిని " ఐ లిడ్ మయోకిమియా" అని అంటారు . పై రెప్పలకన్నా క్రింది రెప్పలు లోనే ఇది ఎక్కువగాజరుగుతుంది . దీని గురించి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి . మన భారతీయ సంప్రదాయాలలో కంటిరెప్పలు అదిరితే అశుభానికి , ఉపద్రవానిని సూచన గా భావిస్తారు ... ఇది ఒక నమ్మకము మాత్రమే . శుభ ... అశుభాలు మనము చేసే పని మంచి చెడుల మీద ఆదారపడి ఉంటుంది .
  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.