Showing posts with label What is Padmini Vidya?. Show all posts
Showing posts with label What is Padmini Vidya?. Show all posts

Tuesday, March 20, 2012

What is Padmini Vidya?, పద్మిని విద్య అంటే ఏమిటి ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : What is Padmini Vidya?, పద్మిని విద్య అంటే ఏమిటి ?

జ : పద్మినీ అనేది విధులను సూచించే విద్య . ఆ విద్యకు అధిదేవత లక్ష్మీదేవి . ఆమె నివసించే పద్మము అధారము గా దీనికి మహపద్మ పద్మినీ విద్య అనే పేరు వచ్చింది . దీనిలోని ఎనిమిది ఉపవిభాగాలే అష్టవిధులుగా పేరు పొందాయి . అవి ...
  1. పద్మ ,
  2. మహాపద్మ ,
  3. మకర ,
  4. కచ్చన ,
  5. ముకుంద ,
  6. నందక ,
  7. నీల ,
  8. శంఖలు .
మానవులకు సంపద మూడు విధాలుగా ప్రాప్తిస్తుంది .
  • దేవతా ప్రసాదము ,
  • సాధుజన సేవ ,
  • స్వయం కృషి .
వీటిలో మొదటినానినే మనము ''అదృష్టము'' అనే పేరుతో పిలుస్తాము . రెండోది దానిని ''సుకృతం '' అని అంటాము . ఇక మూడోదాన్ని " తెలివితేటలు " అని అంటాము . అదృష్టమున్నవాడు కష్టము లేకుండా సంపదలు పోగుచేస్తాడు . సుకృతం ఉన్నవాడే సాధుజన సేవ చేయగలుగుతాడు . అలాగే తెలివితేటలు ఉన్నప్పుడే వయం కృషితో సంపదలు సిద్ధిస్తాయి.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-