ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : What is Padmini Vidya?, పద్మిని విద్య అంటే ఏమిటి ?
జ : పద్మినీ అనేది విధులను సూచించే విద్య . ఆ విద్యకు అధిదేవత లక్ష్మీదేవి . ఆమె నివసించే పద్మము అధారము గా దీనికి మహపద్మ పద్మినీ విద్య అనే పేరు వచ్చింది . దీనిలోని ఎనిమిది ఉపవిభాగాలే అష్టవిధులుగా పేరు పొందాయి . అవి ...
- పద్మ ,
- మహాపద్మ ,
- మకర ,
- కచ్చన ,
- ముకుంద ,
- నందక ,
- నీల ,
- శంఖలు .
మానవులకు సంపద మూడు విధాలుగా ప్రాప్తిస్తుంది .
- దేవతా ప్రసాదము ,
- సాధుజన సేవ ,
- స్వయం కృషి .
వీటిలో మొదటినానినే మనము ''అదృష్టము'' అనే పేరుతో పిలుస్తాము . రెండోది దానిని ''సుకృతం '' అని అంటాము . ఇక మూడోదాన్ని " తెలివితేటలు " అని అంటాము . అదృష్టమున్నవాడు కష్టము లేకుండా సంపదలు పోగుచేస్తాడు . సుకృతం ఉన్నవాడే సాధుజన సేవ చేయగలుగుతాడు . అలాగే తెలివితేటలు ఉన్నప్పుడే వయం కృషితో సంపదలు సిద్ధిస్తాయి.
- ==========================
visit My website >
Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...