ప్రశ్న: బులెట్ ప్రూఫ్ అద్దాలు ఎందుకు పగలవు?,Bulletproof glasses can not break Why?
జవాబు: మామూలు అద్దాలు రాయితో కొడితే భళ్లున పగులుతాయి. వాటి గుండా తుపాకీ గుండు సులువుగా దూసుకుపోతుంది. కానీ బులెట్‌ప్రూఫ్ అద్దాల విషయంలో అలా జరగదు. ఎందుకంటే ఆ అద్దాలను అత్యంత పటిష్టమైన సిలికాన్‌నైట్రైడ్ (silicon nitride)తో కూడిన పింగాణీ పదార్థంతోను, అతి దృఢమైన స్టీలు తోను, గరుకైన నైలాన్ పొరలతోను తయారు చేస్తారు. దృఢమైన పింగాణీ వేగంగా వచ్చే తుపాకి గుండును హఠాత్తుగా ఆపివేయడంతో దాని శక్తి గాజు పలకలోకి చొచ్చుకుపోకుండా, తగిలిన ప్రదేశంలోని పైపొరలోనే వివిధ దిశలకు వ్యాపిస్తుంది. అలా వేగం కోల్పోయిన తుపాకి గుండు గాజు పలక అవతలి వైపునకు పోకుండా ఆ గాజులోని నైలాన్ పొరలతో చేసే గజిబిజి జాలీ (వల)లో చిక్కుకుపోతుంది. అందువల్ల బులెట్‌ప్రూఫ్ అద్దాలు పగలవు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...