ప్రశ్న: సాధారణంగా మొక్కల లేత ఆకులు ఎరుపు రంగులో ఉంటాయెందుకు?
జవాబు: మనుషుల చర్మంలో గోధుమ రంగులో ఉండే వర్ణకాలు (పిగ్మెంట్స్) సూర్యరశ్మిలో ఉండే అతి నీల లోహిత కిరణాల (అల్ట్రావయొలెట్ రేస్) బారి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టే మొక్కలను వాటి ఆకుల్లో ఉండే ఎరుపు రంగు కాపాడుతుంది. మామూలుగా మొక్కల్లో ఉండే క్లోరోఫిల్ వాటిని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. అయితే మొక్కల తొలిదశలో ఈ పదార్థం అంతగా తయారు కాకపోవడంతో ఆ దశలో రక్షణ కోసం 'ఆంథోసియానిన్స్' (Anthocyanins)అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ వర్ణకమే లేత ఆకులకు ఎరుపు రంగును కలుగజేస్తాయి. ఇది అతినీలలోహిత కిరణాలను శోషించడమే కాకుండా మొక్కల జీవకణాల్లోని డీఎన్‌ఏను కాపాడుతుంది. మొక్కలు పెరిగేకొద్దీ క్లోరోఫిల్ సంశ్లేషణం (synthesis)అభివృద్ధి చెందడంతో ఆంథోసియానిన్స్ వర్ణకం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా అప్పటివరకు ఎరుపు రంగులో ఉండే భాగాలు క్లోరోఫిల్ వర్ణమైన ఆకుపచ్చ రంగుకు మారతాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...