ప్రశ్న: వెంట్రుకలు, గోళ్లను కత్తిరించినప్పుడు నొప్పి రాదెందుకు?
జవాబు: నొప్పి కలగడం అంటే మన శరీరంలోని నాడీతంత్రుల (nerve endings) మీద సంకేతాలు రావడమే. మన శరీరంలోని అన్ని అవయవాలలోను, చర్మపు పొరల్లోను ఈ నాడీతంత్రులు విస్తరించి ఉంటాయి. అందువల్ల ఆయా భాగాల్లో దెబ్బ తగిలినా, పుండ్లు ఏర్పడినా, ఏదైనా స్పర్శ తగిలినా మన మెదడు గుర్తిస్తుంది. కానీ గోళ్లు, వెంట్రుకలలో నాడీ తంత్రులు ఉండవు. అందువల్ల వెంట్రుకలు, గోళ్లు కత్తిరించినా నొప్పి కలుగదు. శరీరంలో మిగిలిన భాగాల కన్నా అరికాలు, అరిచెయ్యిల్లో చర్మం మందంగా ఉంటుంది. ఇందులో నాడీ తంత్రులు, పైపొర వరకు దట్టంగా ఉండవు. అందువల్ల సున్నితమైన స్పర్శలను అరికాలు, అరిచెయ్యి గుర్తించలేవు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...