Thursday, March 22, 2012

బూమరాంగ్‌ ఎలా పనిచేస్తుంది?-How Boomerang works?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: బూమరాంగ్‌ను విసిరితే తిరిగి మన దగ్గరకే వచ్చేస్తుంది కదా, అదెలా సాధ్యం?

జవాబు: బూమరాంగ్‌ అంటే ఓ కొడవలి లాంటి ఆట లేదా వేట వస్తువు. ప్రాచీన కాలంలోనే దీని వాడకం గురించిన ఆధారాలు ఉన్నాయి. దీన్ని ఒక పద్ధతిలో విసిరినప్పుడు అది ఒక లక్ష్యాన్ని దెబ్బతీసి తిరిగి ప్రయోగించిన వ్యక్తి దగ్గరకే చేరగలదు. ఇంగ్లిషు అక్షరం V ఆకారంలో వంగిన కొడవలిలాగా ఉన్నా, బూమరాంగ్‌ పరికరం మొత్తం ఒకే సమతలం (plane)లో ఉండదు. చివర్లు రెండూ కూచి (tappered)గా ఉంటే, మధ్య భాగం మందంగా ఉంటుంది. బూమరాంగ్‌ను బల్లపై పెడితే దాని ఒక భుజం బల్ల ఉపరితలానికి ఆనుకుంటే, రెండో భుజం కొంచెం పైకి లేచినట్టు ఉంటుంది. ఈ విధమైన ఆకారం వల్ల బూమరాంగ్‌ను సరైన పద్ధతిలో విసిరినప్పుడు అది గాలిలో ఓ ప్రత్యేకమైన పీడన వ్యత్యాసాలను ఏర్పరుస్తుంది. తద్వారా అది వక్రీయ (curved) మార్గంలో పయనిస్తుంది. బూమరాంగ్‌ను లోహం లేదా కర్ర లేదా ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. దీని వాడకంలో నేర్పరితనం అవసరం.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...