ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: భూమిపై ఉన్నట్టు ఇతర గ్రహాలపై గురుత్వాకర్షణ శక్తి ఉండదా?
జవాబు: ఇతర గ్రహాలపై గురుత్వాకర్షక శక్తి లేదనుకోవడం సరికాదు. గ్రహమేదైనా ఎంతో కొంత గురుత్వాకర్షణ శక్తి తప్పనిసరి. మన సౌరమండలంలోనే భూమి కన్నా తక్కువ, భూమి కన్నా ఎక్కువ గురుత్వాకర్షణ శక్తిగల గ్రహాలున్నాయి. సాధారణంగా ఓ గ్రహపు గురుత్వాకర్షణ శక్తి ఆ గ్రహపు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అనడం కన్నా గురుత్వాకర్షణ బలం అనడం మరింత శాస్త్రీయం. 205 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై ఎంత త్వరణం (acceleration)కలిగించే సత్తా ఉందో ఆ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. మన భూమికి ఇది 9.8 న్యూటన్లు కాగా, బుధగ్రహంపై ఇది కేవలం 3.8 న్యూటన్లు మాత్రమే. చంద్రునిపై ఇది సుమారు 1.4 న్యూటన్లు. అయితే మన సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి (జ్యూపిటర్)పై ఉండే గురుత్వాకర్షక బలం సుమారు 24.8 న్యూటన్లు. అంటే భూమిపై 100 కిలోల బరువుండే ఒక వస్తువు బృహస్పతిపై సుమారు 250 కిలోల బరువు తూగుతుంది. అదే వస్తువు చంద్రుడిపై కేవలం 15 కిలోలు మాత్రమే ఉంటుంది.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...