Showing posts with label పెట్ట ముందా? గుడ్డు ముందా? ఎలా?. Show all posts
Showing posts with label పెట్ట ముందా? గుడ్డు ముందా? ఎలా?. Show all posts

Tuesday, April 02, 2013

Which is first Hen? or Egg?,పెట్ట ముందా? గుడ్డు ముందా? ఎలా?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పెట్ట ముందా? గుడ్డు ముందా? ఎలా?

జ : పెట్ట ముందా.. గుడ్డు ముందా.. అనేది చలాకాలం గా ఎవరికీ అంతుపట్టని , పరిష్కారములేకుండా ఉండిపోయిన ప్రశ్న . చివరికి ఇప్పుడు పెట్ట కాదు గుడ్డే ముందని తేల్చారు శాస్త్రజ్ఞులు .
ఎలా > గుడ్డు పెట్టడమనేది పక్షుల కన్నా ముందే ఈ భూమిమీద పరిణమించిన సరీసృపాలకు ఉన్న లక్షణము . సరీసృవం అంటే .. బల్లి, పాము , మొసలి వంటివి.  డైనోసార్లు గుడ్డు పెట్టేవి. అటువంటి గుడ్డు నుండి వచ్చిన ఒక బుల్లి డైనోసార్ వంటిజీవే పక్షిగా పరిణమించినది . తన పూర్వీక జీవుల లక్షణమైన గుడ్డుపెట్టడం కొనసాగించింది. . . కాబట్టి గుడ్డే ముందు అని  .. ఆ గుడ్డు నుండే పెట్ట వచ్చినదని , దీనికి తిరుగులేదని ఇతర సాక్ష్యాలతో సహా నిరూపించారు పరిశోదకులు.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-