Showing posts with label Soap bubbles do not burst. Show all posts
Showing posts with label Soap bubbles do not burst. Show all posts

Tuesday, August 02, 2011

సబ్బు నురగ నుంచి వచ్చే బుడగలను తడి చేత్తొ ముట్టుకుంటే పేలవు పొడిచెత్తొ తాకితే పేలిపొతాయి ఎందుకు?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

Q : సబ్బు నురగ నుంచి వచ్చే బుడగలను తడి చేత్తొ ముట్టుకుంటే పేలవు . పొడిచెత్తొ తాకితే పేలిపొతాయి ఎందుకు?

(A)===> నీటిలొ సబ్బును వేసినపుడు ...తలతన్యత (surface tension) తగ్గడం వల్ల బుడగలు ఎర్పడతాయి. వీటి లోపల ఉందేదంతా నీటి ఆవిరి,గాలె .

బయటి గాలి పీడనం, బుడగ లోపలి గాలి పీడనం సమానం గా ఉన్నంతసేపు బుడగ స్థిరంగానే ఉంటుంది.లోపలి పీడనం కొంచెం అదికంగా ఉండటంతో బుడగ పెద్దదై ...బయటి గాలి పీడనానికి సమానం అయ్యేంతవరకు విస్తరిస్తుంది. దీని పొర చాలా పలుచగ అంటే మిల్లిమిటరులో పది నుంచి వందవ బాగం మందం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎది తగిలిన ఇట్టె పగిలిపోతుంది. చేయి తడిగా ఉందంటె నీటిపొరతో కూడి ఉన్నట్టే కాబట్టి బుడగ తాకినా దానిపై పొరకు ఏమీ కాదు. పొడిచేత్తొ ముట్టినపుడు బుడగ పైపొరలొని నీరు చేతికి అంటుకుంటుంది. అప్పుడు బుడగ పై పొరలొని నీరు కొంత వెళ్ళిపొయినట్టే కదా . కొన్ని ఇటుకలు తీసెస్తే గోడ కూలినట్టుగానే పొడి చేయి బుడగకు తగిలినపుడు బుడగ పై పొరలొని నీటిని కోల్పొయి అది పేలిపొతుంది.
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.