ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న : ఆసుపత్రుల్లో కనిపించే ప్లస్ గుర్తుకు అర్థం ఏమిటి?
జవాబు : ఆసుపత్రుల్లో కనిపించే ప్లస్ గుర్తును రెడ్‌క్రాస్ చిహ్నం అంటారు. రెడ్‌క్రాస్ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. దీనిని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ కమిటీ నిర్వహిస్తుంది. ఇది 1863లో జెనీవాలో రూపుదిద్దుకుంది. దీని కొనసాగింపుగా 1919లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ ఏర్పడింది. వీటి పనల్లా అంతర్జాతీయంగా యుద్ధాల్లోను, ప్రమాదాల్లోను, మహమ్మారి వ్యాధుల సమయాల్లోను బాధితుల ప్రాణాల్ని రక్షించే మానవతా సేవల్ని అందించడం. ఈ సంస్థకు మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రాణాల్ని కాపాడ్డం, రక్తదానం చేయడం వంటి పలు ఆరోగ్య సంబంధ సేవల్ని అందించే సంస్థ చిహ్నాన్ని ఆసుపత్రులు తీసుకున్నాయి. ప్రజలకు సులభంగా తెలియడానికి ఈ గుర్తు ఉపయోగపడుతుంది.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, --నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================
