Showing posts with label చేపల వాసన వదిలేందుకు చిట్కాలు .. Show all posts
Showing posts with label చేపల వాసన వదిలేందుకు చిట్కాలు .. Show all posts

Friday, February 17, 2012

చేపల వాసన వదిలేందుకు చిట్కాలు .



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : మేము ఇంటిల్లపాది చేపల కూర తింటాము . చేపలు వండేవారి , తినేవారి చేతులు కంపు పోయేందుకు కొన్ని చిట్కాలు చెప్పగలరా?

జ : చేపలను తినడానికి ఇస్టపడేవారు కూడా భరించలేని వాసన చేపలలో ఉంటుంది . చేతులతో పట్టుకున్నా , వంట చేసినా చేపల వాసన అంత త్వరగా వదలదు . ఆ వాసన వదిలించుకునేందుకు ఇంటిలోని పదార్ధాలే చాలు .
  • వాటిలో ముఖ్యమైనది నిమ్మ . నిమ్మ రసముతో చేతులు కడుగుకున్నా , నిమ్మ చెక్కలతో చేతులు తుడుచుకున్నా చేపలవాసన వదులుతుంది .
  • గిన్నెలు కడిగేందుకు ఉపయోగించే పొడిని ద్రవముగా చేసి దానికు ఒక స్పూన్‌ ఉప్పును కలిపి దానితో చేతులు కడుగుకుంటే చేపల వాసన పోతుంది.
  • వంటసోడా కి నీటిని కలిపి ముద్దలా తయారుచేసి ఆ ముద్దతో చేతులు కడుక్కోవాలి .. వాసన పోతుంది .
  • సారా చేతుల మీద చల్లుకొని దానిని నీటితో కడుక్కుంటే చేపల వాసన వదులుతుంది .
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-