Showing posts with label పిల్లల వెంట ప్రొటెక్టివ్ గా ఉండడం. Show all posts
Showing posts with label పిల్లల వెంట ప్రొటెక్టివ్ గా ఉండడం. Show all posts

Saturday, July 16, 2011

పిల్లల వెంట ప్రొటెక్టివ్ గా ఉండడం , Stay always with children to protect ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : పిల్లల వెంట అనుక్షణము ఉంటూ , వారి అవసరాల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ప్రొటెక్టివ్ ఉండడం మంచిదేనా?

జ : ఇది అన్ని సందర్భాలలోనూ మంచి చేయదు . పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఈ ధోరణి బాగానే ఉంటుంది ... కాని వారు ఎదిగేకొద్దీ సమస్యలు మొదలవుతాయి . పిల్లలు ఎదుగుతున్న క్రమము లో కొంత స్వేచ్చను , స్వాతంత్ర్యాన్ని కోరుకుంటారు . అను క్షణము తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఉండే ధోరణీ వారికి నచ్చదు . పెద్దవాళ్ళు వెంటే స్కూల్ కు వచ్చి దింపడం , తీసుకు వెళ్ళడం వంటివి కొందరికి అసంతృప్తిని పెంచుతాయి. మిగతా పిల్లలతోకలిసి స్కూల్ బస్సుల్లోనో , రిక్షాల్లోనో , ఆటోల్లోనో వెళ్ళాలన్న వారి కోరిక తీరదు . మాపిల్లలు తప్ప మరో లోకము లేదనుకునే పెద్దవాళ్ళు ... పిల్లలోని అసంతృప్తిని గమనించాలి .

వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చి పెడుతున్నాము కదా అనుకుంటారే కాని వారి చిన్న చిన్న కోరికలు వేరేఉంటాయి అని గ్రహించరు .. దీనివల్ల పిల్లలలో డిప్రషన్‌ పెరగవచ్చు , కొన్ని సందర్భాలలో ఎదురు తినిగే తత్వము అలవర్చుకోవచ్చు . కావున పిల్లల అవసరాలు ఒకప్రక్క కనిపెడుతూ వారికి కొంత స్వేచ్చ నిస్తూ ఉండాలి .
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.