Showing posts with label హీటర్‌కాయిల్‌నుబకెట్‌లోనీటిఅడుగునపెట్టినా పైనుండేనీరేవేడెక్కుతుందేం?. Show all posts
Showing posts with label హీటర్‌కాయిల్‌నుబకెట్‌లోనీటిఅడుగునపెట్టినా పైనుండేనీరేవేడెక్కుతుందేం?. Show all posts

Sunday, August 10, 2014

హీటర్‌ కాయిల్‌ను బకెట్‌లో నీటి అడుగున పెట్టినా పైనుండే నీరే ముందు వేడెక్కుతుందేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న : వాటర్‌ హీటర్‌ కాయిల్‌ను బకెట్‌లో నీటి అడుగున పెట్టినా ముందుగా ఉపరితలంలోని నీరు వేడెక్కుతుందేం?

జవాబు : బకెట్‌లో నీటి అడుగున వాటర్‌ హీటర్‌ కాయిల్‌ను ఉంచి ఆన్‌ చేయగానే ముందుగా కాయిల్‌ చుట్టూ ఉండే నీరు వేడెక్కుతుంది. ద్రవాల సాంద్రత, ఉష్ణోగ్రత పెరిగే కొలదీ తగ్గుతుంది. అందువలన కాయిల్‌ చుట్టూ వేడెక్కిన నీరు వెంటనే బకెట్‌ ఉపరితలానికి చేరుకుంటుంది. ఉపరితలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండి సాంద్రత ఎక్కువగా ఉండే నీరు బకెట్‌ అడుగుకు చేరుకొని, కాయిల్‌వల్ల వేడెక్కి తిరిగి పైకి చేరుకుంటుంది. ఇలా బకెట్‌లోని నీరంతా ఒకే ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు నీరు పై నుంచి కిందకు, కిందనుంచి పైకి కదులుతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రక్రియను ఉష్ణ వికిరణం (heat convection) అంటారు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-