ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : -చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?
జ : చలికాలము లో దోమలు ఎక్కడికీ పోవు . చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరనము సరిపోక దోమలు ఎటో పారిపోతాయనుకుంటాము కాని నిజానికి అవి ప్రతికూల పరిస్థితులనుండి తప్పించుకునేందుకు దాక్కుంటాయి. ఎక్కువగా ..వేడిగా ఉన్న మన బెడ్ రూములలోనే నివాసాలు ఏర్పరచుకుంటాయి. వీలైతే మనకు కుట్టడానికి ప్రయత్నిస్తాయి. చలికాలము ముందు పెట్టిన గుడ్లు పొదగబడక అలాగే ఉంటాయి. ప్యూపా దశకు చేరినవి అలాగే నిలబడతాయి. ఇక పెడ్ద దోమలయితే గోడలకు అంటిపెట్టుకుని అటూ ఇటూ ఎగరక శరీరములో నిలువ చేసునివున్న శక్తిని వినియోగించుకుటాయి. తిరిగి చల్లని ఉష్ణోగ్రత పోయి అనుకూల పరిస్థితులు రాగానే గుడ్లు , ప్యూపాల నుండి దోమలు పుట్టుకొస్తాయి.
- ====================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
