Showing posts with label Why did wisdom tooth erupt?. Show all posts
Showing posts with label Why did wisdom tooth erupt?. Show all posts

Wednesday, July 29, 2009

జ్ఞాన దంతం ఎందుకు వస్తుంది?,Why did wisdom tooth erupt?





మనిషి జ్ఞానానికి దంతానికి అసలు సంబంధమే లేదు . మరి ఆపేరు ఎందుకు వచ్చిందో తెలయదు . మనిషికి మొత్తం 32 దంతాలు ఉంటాయి , కింది , పై దవడల్లో కుడి వైపు 8 , ఎడమ వైపు 8 దంతాలు అమరి ఉంటాయి . ఆ 8 దంతాలలో ముందుండే 2 కొరుకుడు(incissors) పళ్ళు , ఒక కోరపన్ను(canine tooth) , 2 అగ్రచర్వనాలు(premolars) , 3 చర్వనాలు(Molars) ఉంటాయి . వీటిలో అన్నిటికన్నా లోపల వుండే మూడవ చర్వనాన్ని (3 rd molar) జ్ఞాన దంతము గా పిలుస్తారు .

ఒక నాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపల్లు తో ఉండేది ... కానీ ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి , లోపలి చర్వనానికి స్థానం ఇరుకైనది . ఈ దంతం సాధారణం గా 15 నుండి 25 ఏళ్ళ మధ్య వస్తుంది . ఇరుకు దవడ లో ఆ పన్ను వచ్చేటపుడు చాల భాధ కలుగు తుంది .

అయితే మరో పదివేల సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యా లో మార్పోచ్చి అసలు జ్ఞాన దంటాలే ఏర్పదకపోవచ్చునన్నది ఉహా .
బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది , ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు .