Showing posts with label What is Black box?. Show all posts
Showing posts with label What is Black box?. Show all posts

Monday, December 28, 2009

బ్లాకు బాక్స్ అంతే ఏమిటి?, What is Black box?





హెలికాప్టర్ , విమాలన్లలో వాడే బ్లాకు బాక్స్ అంతే ఏమిటి , అది ఎలా ఉపయోగపడుతుంది ?

నీటిలో తడిచినా ఏమీ కాదు , అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది .. కాబట్టి మంటలలో కాలిన పాడు అవదు . గట్టి పదార్ధం తో తయారు చేస్తారు కనుక ఎంత ఎత్తి నించి కింద పడినా విరగదు . అదే బ్లాకు బాక్స్ . .. విమానాలు , హెలికాప్టర్ లలో తప్పనిసరిగా వీటిని అమర్చుతారు . చిత్రమేమంటే బ్లాకు బాక్స్ నల్లగా ఉండదు . నారింజ రంగులో ఉంటుంది . విమానము పేలిపోయినా , ముక్కలైపోయినా ... ఇది మాత్రము సురక్షితం గానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు . విమానము నడిపే సమయము లో పైలట్ల సంభాషణలను ఇతర శబ్దాలను కొన్ని గంటలపాటు రికార్డ్ చేసే ఏర్పాటు దీనిలో ఉంటుంది . అంతే పమాదానికి ముందు ఎవరేం మాట్లాడారో శబ్దాలు ఏమిటో లాంటి సమాచారాన్ని బ్లాకు బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చును . అందుకే దీని పాత్ర చాలా కీలకమైనది .

బ్లాకు బాక్స్ ఆంటీ ఒక వ్యవస్థ లాంటిదన్నమాట , ఫ్లైట్ డాటా రికార్డర్ (FDR) కాకపిట్ వాయిస్ రికార్డర్ (CVR) అనే రెండు శబ్దగ్రాహక యంత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి . ఇందులో fdr యంత్రం లో విమానము ఎంత ఎత్తులో వెళ్ళింది , ఏ దిశలో వెళ్ళింది , ఎంత వేగం తో గాలి వీచింది లాంటి సాంకేతిక సమాచారము నమోదవుతూ ఉంటుంది . cvr యంత్రము లో అన్ని రకాల శబ్దాలు కొన్ని గంటల పాటు నమోదై ఉంటాయి . ఈ సమాచారము మొత్తాన్ని పరిశోధించి , విశ్లేషించడం ద్వారా నిపుణులు వాయు వాహనాల ప్రమాదాలము కారణాలేంటో తెలుసుకో వచ్చును .

అందుకే ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా .. వెంటనే బ్లాకు బాక్స్ కోసమే వెతుకుతారు . నీటిలో మునిగిపోయినా సరే సునిశితమైన ఆల్త్రసోనిక్ శబ్దతరంగాలను వెలువరించే ఏర్పాటు కుడా వీటిలో ఉంటుంది . దీని ధర ఏడున్నర లక్షల రూపాయల వరకు ఉంటుంది . ఈ బ్లాకు బాక్స్ యంత్రాలతో అనుసంధానం చేసిన సెన్సార్లు విమానమంతా అమర్చి ఉంటాయి .

విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కుడా కొంత సమాచారాన్ని నమోదు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసారని చెబుతారు ... అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వాడకం విస్తరించబడింది , ఇప్పుడైతే విమానము లో బ్లాకు బాక్స్ తప్పనిసరి . మొదట్లో సమాచారము నమోదుకు మాగ్నటిక్ టేప్ లను ఉపయోగించినా ఇప్పుడు దృఢమైన మెమరీ చిప్ లను వాడుచున్నారు . మొదటిగా బ్లాకు బాక్స్ ఫ్లైట్ రికార్డర్ ఉండాలనే అల్లోచన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త " డేవిడ్ వారెన్"కి వచ్చించి . అలా 1953 కల్లా ఆస్ట్రేలియాలో దీన్ని తాయారు చేశారు .





=========================================

visit My website > Dr.Seshagirirao - MBBS.