Showing posts with label టీ కెటిల్‌లో నీళ్లు కాస్తున్నపుడు 'హిస్‌' మనే శబ్దం వస్తుంది ఎందుకు?. Show all posts
Showing posts with label టీ కెటిల్‌లో నీళ్లు కాస్తున్నపుడు 'హిస్‌' మనే శబ్దం వస్తుంది ఎందుకు?. Show all posts

Sunday, July 13, 2014

టీ కెటిల్‌లో నీళ్లు కాస్తున్నపుడు 'హిస్‌' మనే శబ్దం వస్తుంది ఎందుకు?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: టీ కెటిల్‌లో నీళ్లు కాస్తున్నపుడు 'హిస్‌' మనే శబ్దం వస్తుంది ఎందుకు?

జవాబు : కెటిల్‌లో నీరు పోసి స్టవ్‌ మీద పెడితే నీరు వేడెక్కేకొలదీ కెటిల్‌ కూని రాగాలు తీస్తుంది. స్టవ్‌ వెలిగించగానే మొదటగా కెటిల్‌ అట్టడుగు భాగంలో ఉన్న నీటి పొర వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. ఆ నీటి ఆవిరి బుడగల సాంద్రత, నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండటంతో అవి పైకి లేస్తాయి. కింది పొరలో ఏర్పడిన బుడగలు పై పొరలలోని చల్లని నీటిని తాకడంతో సంకోచం చెంది చివరకు పూర్తిగా ముడుచుకుని పోతాయి. ఈ విధంగా ముడుచుకుపోయే అనేక నీటి ఆవిరి బుడగలు చేసే శబ్దమే కెటిల్‌ నుంచి వినిపించే 'హిస్‌' శబ్దం. ఈ బుడగల సంఖ్య పెరిగే కొలదీ శబ్దం కూడా ఎక్కువవుతుంది. కెటిల్‌లోని నీరంతా పూర్తిగా వేడెక్కి ఉష్ణోగ్రత బాష్ఫీభవన స్థానం చేరేటప్పటికి కెటిల్‌లో చల్లని పొరలు లేకపోవడంతో నీటి ఆవిరి బుడగలు సంకోచించడం ఆగిపోతుంది. దాంతో శబ్దం కూడా ఆగిపోతుంది. ఈ దశ తర్వాత కెటిల్‌లోని నీరు మొత్తం మరగడం ప్రారంభమవుతుంది.

  • - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-