Showing posts with label సముద్రం నీరు ఉప్పనేల?. Show all posts
Showing posts with label సముద్రం నీరు ఉప్పనేల?. Show all posts

Monday, March 02, 2009

సముద్రపు నీరు ఉప్పుగా ఎందుకుంటుంది ?, Sea water is saltish .. Why ?


నది -----------------------------------సముద్రము

సముద్రపు నీరు నేడు ఉప్పు గా త్రాగడానికి పనికిరాకుండా ఉన్నప్పటి కి ... అవి కుడా ఆరంభము లో మంచినీరే . భూమి పై నుండి లవణాలతో కూడిన మంచి నీరు -( పి.ఎచ్ 7.0 కంటే తక్కువ ఉన్నటువంటి ) నదుల ద్వారా సముద్రము లో చేరుతుంది .

నీరు ఆవిరి అవగా లవణాలు మిగిలి ... వాటి సాంద్రత పెరుగు తూ .. అనేక లక్షల సంత్సరాల ఈ పక్రియ వల్ల సముద్రపు నీరు ఉప్పుగా మారింది . పి.ఎచ్ 7.0 కంటే ఎక్కువ గా ఉంటుంది . సముద్రపు ఉప్పదనాన్ని "లవనీయత " అంటారు . ఇది వెయ్యి మీ.లీ. నీటి లో 35 గ్రాములుగా ఉంటుంది . లవనీయత ను % అనే సంకేతం తో చూపుతారు .

సముద్రం నీరు ఉప్పనేల?
ప్రశ్న:
సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుందేం?

జవాబు:
ఏ సముద్రంలోని నీరైనా ఉప్పగానే ఉండడానికి కారణం ఆ నీటిలో ఉప్పు ఉన్నందువల్లనే. అయితే ఆ ఉప్పు ఎక్కడిదో చూద్దాం. ఉప్పు నీటిలో కరుగుతుంది కదా. వర్షం నీరు భూమిపై పొరల్లో ఉండే ఉప్పు, ఇతర ఖనిజ లవణాలను నదుల్లోకి మోసుకుపోతుంది. ఆ నదులు వాటిని సముద్రాల్లోకి చేరుస్తాయి. సముద్రాల లోని నీరు సూర్యరశ్మిలోని ఉష్ణశక్తి వలన నీటి ఆవిరిగా మారి, భూమిపై వాతావరణంలో మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలలోని నీరే వర్షించి తిరిగి భూమిపై పారి లవణాలను సముద్రంలోకి చేరుస్తుంది. సముద్రాలలోకి చేరే నీరు తిరిగి ఆవిరి రూపం పొందినా, లవణాలు మాత్రం భాష్పీభవనం చెందలేక సముద్రాల్లోనే పేరుకుపోతుంది. ఈ చక్రక్రమం అనేక కోట్ల సంవత్సరాల నుంచి జరగడం వల్ల సముద్ర జలాల్లో ఉప్పు పరిమాణం నిరంతరంగా పెరుగుతూనే ఉంఉంది. అందువల్లనే ఆ నీరు ఉప్పన.

  • ===============================================
Visit my website - > dr.seshagirirao - MBBS