Showing posts with label మన దేహంలోని జీవ కణాల పరిమాణం ఎంత ఉంటుంది?. Show all posts
Showing posts with label మన దేహంలోని జీవ కణాల పరిమాణం ఎంత ఉంటుంది?. Show all posts

Thursday, August 08, 2013

What is the size of human body cell?,మన దేహంలోని జీవ కణాల పరిమాణం ఎంత ఉంటుంది?

  •  


  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: మన దేహంలోని జీవ కణాల పరిమాణం ఎంత ఉంటుంది? రక్తంలో ఎన్ని జీవకణాలు ఉంటాయి?

జవాబు: మానవుని శరీరంలో రెండు వందల రకాల జీవ కణాల కన్నా ఎక్కువే ఉంటాయి. ఇవన్నీ వివిధ పరిమాణాలు కలిగి ఉంటాయి. చాలా వరకు వీటి వ్యాసం 20 నుండి 50 మైక్రో మీటర్ల మధ్య ఉంటుంది. (1 మైక్రో మీటరు = మిల్లీ మీటర్‌లో వెయ్యో వంతు). 120 మైక్రో మీటర్ల వద్ద ఉండే అండాశయ గుడ్ల కణాలు (ova) అతి మందమైనవైతే, వీర్య కణాల (spermatoza) వ్యాసం మూడు మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. అతి పొడవైన కణాలు వెన్నెముక సంబంధిత నరాల కణాలు. ఈ కణాలు ఒక మీటరు పొడవు ఉండే శాఖలను ఏర్పర్చగలవు. ఇక రక్తం విషయానికి వస్తే, నడివయసులో ఉండే ఒక వ్యక్తిలోని 5 లీటర్ల రక్తంలో 50 బిలియన్ల తెల్లకణాలు (1 బిలియన్‌ = వెయ్యి మిలియన్లు; 1 మిలియన్‌= 10లక్షలు) 1.5 ట్రిలియన్‌ (1ట్రిలియన్‌= 1000 బిలియన్లు) రక్తకణ పట్టికలు(blood platelets), 25 ట్రిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఉండే మొత్తం జీవకణాల్లో 4వవంతు. 2 మిలియన్ల కన్నా ఎక్కువ ఎర్రరక్తకణాలు ఎముకల్లోని మూలగ (marrow)లో ప్రతిసెకనుకూ ఉత్పన్నమవుతుంటాయి. మన రక్తంలో ఉండే జీవకణాలన్నిటినీ ఒక దాని తర్వాత మరొకటి పేరిస్తే ఆ వరస పొడవు 1,92,500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే భూమి చుట్టూ 5 వరసలుగా చుట్టవచ్చని అంచనా.

-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు--హైదరాబాద్‌
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-