Showing posts with label తుపాను వచ్చేముందు కీటకాలకు తెలిసిపోతుందా?. Show all posts
Showing posts with label తుపాను వచ్చేముందు కీటకాలకు తెలిసిపోతుందా?. Show all posts

Sunday, July 12, 2015

తుపాను వచ్చేముందు కీటకాలకు తెలిసిపోతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...









ప్రశ్న: ఉరుములతో కూడిన 'తుపాను' వచ్చే ముందు కొన్ని పురుగులు, కీటకాలు నేలకు దగ్గరగా ఎగురుతూ ఉంటాయి. ఎందుకు?

జవాబు: మామూలుగా దోమల వంటి చిన్న కీటకాలు గాలిలో ఎగురుతూ, తిరుగుతుంటాయి. వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నపుడు, గాలి బరువుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎగిరే కీటకాలకు వాతావరణంలోని పై పొరలలోకి ప్రవేశించి ఎగరగలిగే ప్రేరణ లభిస్తుంది. కానీ తుపాను రావడానికి ముందు వాతావరణ పీడనం తగ్గిపోవడంతో ఎక్కువ ఎత్తులో ఎగిరే కీటకాలు భూమికి దగ్గరగా కింది తలాలకు పడిపోతాయి. ఆ పరిస్థితుల్లో అవి తమ రెక్కల సాయంతో కాకుండా తుపాను ముందు వీచే నులివెచ్చని గాలితోపాటు ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరే కీటకాలను తుపాను పురుగులు అంటారు. ఇలా ఎగిరే కీటకాలు ప్రపంచం మొత్తం మీద 5,000 రకాలు ఉన్నాయి. నేలకు దగ్గరగా ఎగిరే ఈ కీటకాలు తుపాను రాకను ముందుగా తెలియజేసి మనకు కొంత వరకు మేలు చేస్తాయి. కానీ అవి ఏపుగా ఎదిగిన మొక్కల ఆకులకు రంధ్రాలు చేసి ఆ మొక్కల్లోని జీవరసాన్ని ఆహారంగా పీల్చి వేయడంతో పూలు, కులు త్వరగా నశిస్తాయి. అలా ఈ కీటకాలు ప్రకృతికి హాని కలగజేస్తాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-