ప్రశ్న: ఉరుములతో కూడిన 'తుపాను' వచ్చే ముందు కొన్ని పురుగులు, కీటకాలు నేలకు దగ్గరగా ఎగురుతూ ఉంటాయి. ఎందుకు?
జవాబు: మామూలుగా దోమల వంటి చిన్న కీటకాలు గాలిలో ఎగురుతూ, తిరుగుతుంటాయి. వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నపుడు, గాలి బరువుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎగిరే కీటకాలకు వాతావరణంలోని పై పొరలలోకి ప్రవేశించి ఎగరగలిగే ప్రేరణ లభిస్తుంది. కానీ తుపాను రావడానికి ముందు వాతావరణ పీడనం తగ్గిపోవడంతో ఎక్కువ ఎత్తులో ఎగిరే కీటకాలు భూమికి దగ్గరగా కింది తలాలకు పడిపోతాయి. ఆ పరిస్థితుల్లో అవి తమ రెక్కల సాయంతో కాకుండా తుపాను ముందు వీచే నులివెచ్చని గాలితోపాటు ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరే కీటకాలను తుపాను పురుగులు అంటారు. ఇలా ఎగిరే కీటకాలు ప్రపంచం మొత్తం మీద 5,000 రకాలు ఉన్నాయి. నేలకు దగ్గరగా ఎగిరే ఈ కీటకాలు తుపాను రాకను ముందుగా తెలియజేసి మనకు కొంత వరకు మేలు చేస్తాయి. కానీ అవి ఏపుగా ఎదిగిన మొక్కల ఆకులకు రంధ్రాలు చేసి ఆ మొక్కల్లోని జీవరసాన్ని ఆహారంగా పీల్చి వేయడంతో పూలు, కులు త్వరగా నశిస్తాయి. అలా ఈ కీటకాలు ప్రకృతికి హాని కలగజేస్తాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్
- ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...