ప్రశ్న: మనలో చాలా మందికి చదవుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది ఎందుకు?
జవాబు: చదివేటప్పుడు నిద్ర రావడమనేది మనం ఏ భంగిమలో ఉన్నాం, ఎంతసేపు ఉన్నాం అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. చదివేటపుడు మన శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల కండరాలకు ప్రవహించే రక్త ప్రసరణ తగ్గుతుంది. దాని వల్ల శరీరంలోని జీవకణాల్లో దహనచర్య మందగించి, లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లం తయారవుతుంది. ఈ ఆమ్లం ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అతిగా పీల్చుకొంటుంది. దాంతో శరీరంలోని రక్తానికి కావలసిన ఆక్సిజన్‌లో కొంత తగ్గుతుంది. ఆక్సిజన్ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా, నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు ఒకే భంగిమలో ఉండి పోకుండా అపుడపుడూ అటూ ఇటూ కదలడం, ఏకబిగిన చదవకుండా మధ్యలో కాస్త విరామం ఇవ్వడం అవసరం.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్
- =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...