ప్రశ్న: మోటారు వాహనాలను పెట్రోల్‌కు బదులు గాలితో నడపడానికి వీలుందా?
జవాబు: రోజు రోజుకూ పెట్రోల్ ధర పెరిగిపోతున్న కారణంగా ప్రపంచ దేశాల్లోని శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ ఇంధనాల అన్వేషణలో తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాసలోని భాగమే బాగా ఒత్తిడికి గురి చేసిన గాలి లేక ఇతర వాయువులను (వీటిని సంపీడన వాయువులు అంటారు) మోటారు వాహనాలను నడపడానికి ఉపయోగించవచ్చా అనే దిశలో ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాలు. ఒత్తిడిలో ఉన్న వాయువును వ్యాకోచింపజేస్తే ఉత్పన్నమయే బలం మోటారు వాహన ఇంజన్ పిస్టన్‌ను నడపడానికి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో నడిచే వాహనం శబ్ద కాలుష్యం లేకుండా నిశ్శబ్దంగా నడవడమే కాకుండా, కార్బన్, పొగలాంటి కాలుష్యాలు వెదజల్లదు.
గాలి (వాయువు) సాయంతో నడిచే ఈ 'ఎయిర్ కారు'లో అత్యధిక ఒత్తిడికి గురిచేసిన గాలితో నింపిన గాలి సీసాలు ఉంటాయి. ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో పయనించేటట్టు డిజైన్ చేస్తారు. ఒత్తిడిగల గాలితో టాంకులు నింపడానికి పెట్రోలు టాంకులలా కాకుండా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. పెట్రోల్ ప్రమేయం లేకుండా మోటారు వాహనాలను నడిపే మరో ప్రాజెక్టులో నైట్రోజన్‌ను ఇంధనంగా వాడతారు. ఈ వాయువులో 78 శాతం గాలి మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ వద్ద వాయురూపంలో ఉండి, వేడి చేసినపుడు 700 రెట్లు వ్యాకోచిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇంధన స్టేషన్లు దేశదేశాల్లో వెలిసే అవకాశం ఉంది.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...