ప్రశ్న: వాన చినుకులు గుండ్రంగానే ఉంటాయెందుకు?
జవాబు: ద్రవపదార్థాల ఉపరితలం సాగదీసిన పొరలాగా స్థితిస్థాపకత (elasticity) కలిగి ఉండి బిగువు (tension)గా ఉంటుంది. ఈ ధర్మాన్నే తలతన్యత (surface tension) అంటారు. దోమలు నీటి ఉపరితలంపై మునిగిపోకుండా నిలబడి ఉండడానికి కారణం తలతన్యతే.
ద్రవాలకు స్వేచ్ఛ లభిస్తే తలతన్యత వల్ల అవి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తాయి. ఆకారాలన్నింటిలో గోళాకారానికి తక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది. అందుకే స్వేచ్ఛగా ఆకాశంలోని మబ్బుల నుంచి జారిపడే వాన చినుకు గోళాకారంలో అంటే గుండ్రంగా ఉంటుంది. చెమట బిందువులు, నీటిలో పడిన నూనె, సీసా నుంచి నేలపై ఒలికి పడిన పాదరసం, ఎత్తు నుంచి నేలపై చిందిన పాలు బిందువులుగా గుండ్రని గోళాకారంలో ఉండడానికి కారణం కూడా ఇదే.
- -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ========================
