Showing posts with label భూమిపైన అన్నింటి కన్నా పెద్ద పక్షి ఏది?. Show all posts
Showing posts with label భూమిపైన అన్నింటి కన్నా పెద్ద పక్షి ఏది?. Show all posts

Monday, April 14, 2014

Biggest bird on the Earth?,భూమిపైన అన్నింటి కన్నా పెద్ద పక్షి ఏది?

  •  

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులన్నింటి కెల్లా అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ కళ్లు 50 మిల్లీమీటర్ల (రెండు అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటాయి. ఆస్ట్రిచ్ కాళ్లు, మెడ చాలా పొడవుగా ఉండటం వలన ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఆస్ట్రిచ్‌లు దాదాపు 1.8 నుంచి 2.75 మీటర్ల (ఆరు నుంచి తొమ్మిది అడుగులు) ఎత్తు, బరువు 63 నుంచి 130 కిలో గ్రాములు ఉంటుంది. కొన్ని మగ ఆస్ట్రిచ్‌లు 155కిలో గ్రాములు వరకు బరువు ఉంటాయి. ఆస్ట్రిచ్ కళ్లు పెద్దవిగా ఉండటం వలన అవి చాలా దూరంలో ఉన్న శత్రువులను కూడా సులభముగా కనిపెట్టగలవు.

శత్రువులను చూసిన వెంటనే ఆస్ట్రిచ్‌లు నేలపై పడుకుంటాయి లేదా పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు గంటకు 60 నుండి 72.4 కిలోమీటర్ల (45 మైళ్ల ) వేగంతో పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు నిలువకుండా 30 నిమిషాలు పరుగెత్త గలవు.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-