Monday, July 13, 2015

నీటి సదుపాయం ఏ మాత్రం లేని ఎడారులలో కొన్ని మొక్కలు ఎలా పెరుగగలుగుతున్నాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్రశ్న: నీటి సదుపాయం ఏ మాత్రం లేని ఎడారులలో కొన్ని మొక్కలు ఎలా పెరుగగలుగుతున్నాయి?

జవాబు: ఎడారులలో 'వృక్ష సంపద' అంటూ ఏమీ లేకపోయినా జెముడు (కేక్టస్‌), ఔషధ సంబంధిత గడ్డి మొక్కలు, చిన్న పొదలు అక్కడ పెరుగుతాయి.xerophytese అని ప్రసిద్ధిగాంచిన ఈ మొక్కలకు అంతగా అనుకూలించని పరిసరాలలో కూడా పెరిగే సామర్థ్యంఉంటుంది. ఇవి పెరగడానికి అతి కొద్ది పాటి నీరు (తేమ) సరిపోతుంది. ఆ నీరు సంపాదించుకోవడంలో అవి వివిధ మార్గాలు అవలంబిస్తాయి. ఉదాహరణకు, జెముడు మొక్కలు ఎపుడైనా పడిన వర్షపు తుంపరల నీటిని అనేక నెలల పాటు తమలో నిల్వ ఉంచుకోగలవు. గుబురుగా పొదల రూపంలో ఉండే హెర్బాసియన్‌ మొక్కల వేర్ల వ్యవస్థలు ఎడారులలోని భూభాగం లోపల అతి లోతుగా విశాలంగా వ్యాపించి అక్కడి భూగర్భ జలాన్ని అధిక శాతంలో పీల్చుకుంటాయి. ఎడారులలో ఉండే చెట్ల వేర్లు కూడా భూమి లోతులకు చొచ్చుకొనిపోయి అక్కడి నీటిని పీల్చుకొని, వాటి ఆకులను త్వరత్వరగా రాల్చుకొంటాయి. అందువల్ల చెట్ల ఆకుల నుంచి భాష్పీభవన ప్రక్రియ ద్వారా ఆవిరయ్యే నీటి శాతం తగ్గి, చెట్లలోనే నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌


  • =====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...