ప్ర : పిల్లల వెంట అనుక్షణము ఉంటూ , వారి అవసరాల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ప్రొటెక్టివ్ ఉండడం మంచిదేనా?
జ : ఇది అన్ని సందర్భాలలోనూ మంచి చేయదు . పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఈ ధోరణి బాగానే ఉంటుంది ... కాని వారు ఎదిగేకొద్దీ సమస్యలు మొదలవుతాయి . పిల్లలు ఎదుగుతున్న క్రమము లో కొంత స్వేచ్చను , స్వాతంత్ర్యాన్ని కోరుకుంటారు . అను క్షణము తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఉండే ధోరణీ వారికి నచ్చదు . పెద్దవాళ్ళు వెంటే స్కూల్ కు వచ్చి దింపడం , తీసుకు వెళ్ళడం వంటివి కొందరికి అసంతృప్తిని పెంచుతాయి. మిగతా పిల్లలతోకలిసి స్కూల్ బస్సుల్లోనో , రిక్షాల్లోనో , ఆటోల్లోనో వెళ్ళాలన్న వారి కోరిక తీరదు . మాపిల్లలు తప్ప మరో లోకము లేదనుకునే పెద్దవాళ్ళు ... పిల్లలోని అసంతృప్తిని గమనించాలి .
వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చి పెడుతున్నాము కదా అనుకుంటారే కాని వారి చిన్న చిన్న కోరికలు వేరేఉంటాయి అని గ్రహించరు .. దీనివల్ల పిల్లలలో డిప్రషన్ పెరగవచ్చు , కొన్ని సందర్భాలలో ఎదురు తినిగే తత్వము అలవర్చుకోవచ్చు . కావున పిల్లల అవసరాలు ఒకప్రక్క కనిపెడుతూ వారికి కొంత స్వేచ్చ నిస్తూ ఉండాలి .
- ==========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...