ఫ్ర : మాంసాహార మొక్క-బ్లాడర్ వోర్ట్స్ సొంగతేమిటి?, What about bladderworts plant?
జ : మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూరలను, పండ్లను తినడం వల్ల ఎలాంటి జబ్బులూ రావని అందరికీ తెలిసిన విషయమే. అందుకే చాలామంది మాంసాహారాన్ని వదలి శాఖాహారులుగా మారిపోతున్నారు. అలాంటిది ఇంతకాలం అందరూ శాఖాహారులనుకుంటున్న మొక్కలు మాంసాహారులుగా మారితే...! అమ్మో... ఇంకేమైనా ఉందా...?!
అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న అలాంటి ఓ మాంసాహార మొక్కే "బ్లాడర్ వోర్ట్స్". చిన్న చిన్న కొలనుల్లో, చెరువులలో జీవించే ఈ మొక్క చూడటానికి అందంగా కనిపిస్తూ, క్రిమికీటకాలను ఆకర్షిస్తుంది. ఆ సమయంలో తనపై ఏవైనా కీటకాలు వాలగానే గుటుక్కున మింగేస్తుంది.
ఈ బ్లాడర్ వోర్ట్స్ మొక్క క్రిమికీటకాలను చంపే విధానం చూస్తే.... అమ్మో... ఎంత తెలివిగా చంపుతోంది అని నోళ్ళెళ్లబెట్టక మానము. రెండు చిప్పల్లాగా తెరుచుకుని కనిపించే పత్రాలే ఈ మొక్కకు ఆయుధాలు. కీటకం ఈ చిప్పల మధ్యకు పోగానే ఈ రెండు చిప్పలూ మూసుకుపోతాయి. అందులో చిక్కుకున్న కీటకాన్ని ఆ రెండు చిప్పలు పీల్చిపిప్పి చేస్తాయి.
ఈ మొక్కలు కీటకాలతో పాటుగా చిన్నపాటి బల్లులను కూడా భోంచేస్తాయి కాబట్టి దీనిని ఇళ్లలో కూడా పెంచుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతేగాకుండా, ఈగలు, దోమలు లాంటి క్రిమికీటకాలతో పాటుగా, బల్లులను తింటున్న ఈ మొక్క మనకు మేలే చేస్తుందని శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు.
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...