ప్ర : కొన్ని మొక్కలు జంతువులను తింటాయెందుకు ?
జ : సాదారణము గా మొక్కలు , చెట్లు కిరణజన్య్సంయోగ క్రియ (photo synthesis)వలన ఆహారము తయారుచేసుకుంటాయి. మొక్కలలో ఉన్న హరితపదార్ధము (chlorofil), సూర్యరస్మి (sun light), భూమి(మట్టి)లోని (clay) నత్రజని సహాయము తో తమకు కావల్సినంత ఆహారము తయారుచేసుకుంటాయి . కొన్ని మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతాయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. నత్రజనికోసమే కీటకాలను తింటాయి .
క్రిములను, కీటకాలను మరియు చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంసభక్షణ మొక్కలు ( Insectivorous or Carnivorous plants) అంటారు. ఇవి చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతాయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. అందువల్ల ఈ విధంగా క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను 'బోను పత్రాలు' అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వలన కీటకాలలోని ప్రోటీనులు విశ్లేషించి జీర్ణం చేయబడతాయి. జీర్ణం చేయబడిన ప్రోటీనులను ఈ పత్రాలు శోషిస్తాయి. ఇవి ఉత్తర, దక్షిణ కరోలినా (usa), ప్రాంతాల్లో అగుపిస్తాయి.
కీటకాహార మొక్కలకు ఉదాహరణలు: నెపెంథిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా,డయోనియా, సర్రెసీనియా, ఆల్ డ్రోవాండా, వీనస్ ఫ్లై ట్రాప్ (venus flytrap) , పిచ్చర్ మొక్క(pitcher plant) మరియు సన్ డ్యూ (sundew) మొక్క.
- =================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...