Friday, July 22, 2011

బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య తేడా ఏమిటి?, What is difference between Bacteria and Virus?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య తేడా ఏమిటి?

-ఎన్‌. కిరణ్‌కుమార్‌, ఇంటర్‌, గుడివాడ

జవాబు: బ్యాక్టీరియా, వైరస్‌ల మధ్య ప్రధానమైన ఒక తేడా వాటి పరిమాణం. బ్యాక్టీరియా వ్యాసం ఒక మైక్రోమీటర్‌ (మిల్లీమీటర్‌లో వెయ్యో వంతు) ఉంటే, వాటి పొడవు 1 నుంచి 3 మైక్రోమీటర్లు ఉంటుంది. అదే ఒక వైరస్‌ పొడవు 0.02 నుంచి 0.3 మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక బ్యాక్టీరియా స్వతంత్రంగా సంతానోత్పత్తి చేయగల సూక్ష్మజీవి. వైరస్‌ వాటి పునరుత్పత్తికి జీవమున్న వేరే కణాలపై ఆధారపడతాయి. వైరస్‌లలో ఒక రకమైన న్యూక్లియక్‌ యాసిడ్‌ మాత్రమే ఉండి, వాటి ప్రాజనిక రూపం (genotype) అయిన వాటి సంతతి డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ మాత్రమే కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా డీఎన్‌ఏలో జన్యు సంబంధిత సమాచారం పూర్తిగా ఉండడమే కాక, ఇతర జీవ ప్రక్రియలను కొనసాగించడానికి కావలసిన అన్ని రకాల ఆర్‌ఎన్‌ఏను కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాను ఎదుర్కోవడం సులభం. ఎందుకంటే వాటి జీవప్రక్రియ (metabolism)ను యాంటీబయోటిక్స్‌ మందులతో అంతమొందించి చంపవచ్చు. వైరస్‌ల ఉత్పత్తి వేరే కణాల జీవ ప్రక్రియపై ఆధారపడి ఉండడంతో, వాటిపై యాంటీబయోటిక్స్‌ పనిచేయవు. ప్రస్తుత కాలంలో వైరస్‌లను అంతమొందించడానికి ఏవో కొన్ని మందులను మాత్రమే కనిపెట్టగలిగారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...