Thursday, July 21, 2011

హేతువాదము అంటే ఏమిటి ?, What is Hetuvadam?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించేవారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు.జ్ఞానానికి లేదా ఋజువుకు "హేతువు" లేదా "కారణం" అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు. (Rationalism, a philosophical position, theory, or view that reason is the source of knowledge)

ఆస్తిక హేతువాదులు: మతంలో ఉంటూనే అహేతుక విషయాలను ప్రశ్నిస్తూ ఉంటారు. మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు.

నాస్తిక హేతువాదులు: దేవుడిని పూర్తిగా ఒప్పుకోరు. ప్రతి దానికీ కారణం ఉంటుందని నమ్ముతారు.


కొంతమంది ప్రముఖ తెలుగు హేతువాదులు

* వేమన
* పోతులూరి వీరబ్రహ్మం
* స్వామినేని ముద్దునరసింహంనాయుడు
* కందుకూరి వీరేశలింగం
* ఆరుద్ర
* ముద్దుకృష్ణ
* చలం
* కొడవటిగంటి కుటుంబరావు
* ఎస్.జయరామరెడ్డి సుజరె
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

2 comments:

your comment is important to improve this blog...