Sunday, July 24, 2011

హెన్నాఅంటే ఏమిటి?, What is Henna ?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : హెన్నాఅంటే ఏమిటి?, What is Henna ?

జ : హెన్నా అనేది గోరింటాకు మొక్క . దీని శాస్త్రీయ నామము -- lawsonia inermis also called as mignonette tree . ఇది పూలు పూచే మొక్క . ఆకులను చర్మము , జుట్టు , గోళ్ళు కు రంగు వేయుటకు , లెదర్ , వూల్ పరిశ్రమలలో రంగులు అద్దేందుకు వాడుతారు . మెహిందీ ని తయారు చేస్తారు .

ఆషాడంతో మొదలుపెట్టి అట్లతద్ది, వినాయక చవితి, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్‌మస్, సంక్రాంతి… అంటూ ప్రతి పండుగకూ అరచేతి గోరింటను పండించేవారు పల్లెపడుచులు ఒకప్పుడు. కాలగతిలో కనుమరుగయ్యే అనేకానేక పద్ధతులకు భిన్నంగా ఆనాటి గోరింట నేడు హెన్నాగా మారి ఆధునిక యుగంలో అత్యాధునిక ఫ్యాషన్‌గా ఎదిగింది.

పండుగ పబ్బాలతో నిమిత్తం లేకుండా పల్లె, పట్నం అన్న తేడా లేకుండా పల్లె పడుచునీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నీ, కాలేజీ, యూనివర్సిటీ అమ్మాయిల్ని, ఫ్యాషన్ డిజైనర్లనీ, క్రీడాకారుల్ని, కళాకారుల్నీ ఏకరీతిన ఆకట్టుకోగలగడంతో పాటు పాశ్చాత్యుల్ని సైతం అతివలందరి మనసుల్ని దోచుకుని సుమనోహర సౌందర్యమై వెలుగొందుతోంది. ప్రధానంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైంది. ప్రతి తెలుగింట శుభకార్యాల్లో ఇంకా చెప్పాలంటే ప్రతి వేడుకలోనూ మమేకమై ఆడపడుచుల ఒంటినిండా గోరింటాకు పూస్తుంది.

చుండ్రు నివారణలో హెన్నాపాత్ర : హెన్నా తలకు పెట్టుకోవటం వల్ల తలలోని చుండ్రుని, తెల్ల వెంట్రుకలను నివారిస్తుంది. ఇది హెయిర్‌ రూట్‌ని టైట్‌ చేస్తుంది. వెంట్రుక చివర్లను చిట్లిపోనీకుండా ఉంచుతుంది. హెయిర్‌ రూట్‌ టైట్‌ అవడం వల్ల జుట్టు ఊడదు. హెన్నా తలకు పెట్టడం వలన మాడుపోటు, తలనొప్పి ఇటువంటివి తగ్గడమే కాక కళ్ళకు చాలా చలువ చేస్తుంది. అంతకుముందు ఊడిన వెంట్రుకలు త్వరగా వస్తాయి జుట్టు మంచి షయినింగ్‌గా, పట్టుకుచ్చువలె ఉంటుంది. అధికంగా చిక్కుపడే జుట్టును మృదువుగా ఉంచుతుంది. హెన్నా పేను కొరుకుడుని కూడా నివారిస్తుంది.

హెన్నా పౌడర్‌ అంటే ఒట్టి గోరింటాకు పొడే అనే అభిప్రాయం చాలామందికి ఉన్నది. హెన్నా పౌడర్‌లో చాలా హెర్బల్‌ పౌడర్స్‌ కలుస్తాయి. వాటిలో కొన్ని గోరింటాకు పొడి, మెంతుపొడి, అవ్లూపౌడర్‌, ట్రిప్‌లా ఇలా ఇంకా కొన్ని కలుపుతారు. ఈ మొత్తం కలిపినదే హెన్నా పౌడర్‌.

తయారుచేయు విధానం :
కావలసిన పదార్థాలు :

హెన్నా పౌడర్ - 2 కప్పులు
నిమ్మకాయలు - 3
పెరుగు - 1/2 కప్పు
టీ డికాషన్ - 1 కప్పు
గ్రుడ్లు - 2


ఇవ్వన్నీ వేసి మెత్తగా పేస్టులాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత సుమారు 6 గంటల పాటు దానిని వుంచాలి. తరువాత చేతులకు గ్లౌజులు వేసుకుని వెంట్రుకలను పాయలు పాయలుగా తీసుకుని స్కాల్స్ నుంచి వెంట్రుక చివరిదాకా ఈ పేస్టును రాయాలి. జుట్టు అంతా పట్టించి ఒక ముడిలాగా మాడుపైన పెట్టుకోవాలి. మొత్తం పెట్టాక 2 గంటలు వుంచుకోవాలి. ఇది త్వరగా ఆరాలని ఫ్యాను క్రిందగాని ఎండలోగాని నించోకండి. 2 గంటలు అయిన తర్వాత తలస్నానం చేయాలి. చక్కగా నిదానంగా నీళ్ళతో షాంపు చేసుకోవాలి. తర్వాత తలను సహజసిద్ధంగా ఆరనిస్తే కురులు మరింత ఆరోగ్యవంతంగా వుంటాయి.

హెన్నా వలన లాభాలు
  • *శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
  • *శరీరానికి హెన్నా కారణంగా ఎలాంటి హానీ కలగదు. చర్మానికి దీనివల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులూ ఉండవు.
  • *హెన్నా చర్మానికి, శిరోజాలకూ మేలుచేసే సాధనం.
  • *కురులకు మంచి కండిషనర్‌.
  • *ఇది యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడంలోని అసలు పరమార్థం ఇదే!
  • *చుండ్రును సమర్థవంతంగా అరికడుతుంది



  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...