ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : బొమ్మలు గీసే ఆ పెన్సిల్ ఎలా పుట్టిందో తెలుసా...?
జ : ఇంగ్లాండ్ దేశంలో జేసెఫ్ డిక్సన్ అనే ఓ పేదవాడు ఇల్లు గడవటానికి ఓ చిన్న దుకాణంలో పనికి కుదిరాడు. యజమాని చెప్పింది గుర్తు పెట్టుకునేందుకు ఏంచెయ్యాలో తెలియక, ఓ నల్లటిరాయితో గోడమీద
రాసుకున్నాడు. ఆ రోజు నుండీ క్రమం తప్పకుండా డిక్సన్ యజమాని చెప్పిన విషయాలను గోడమీడ ఆ నల్లరాయితో రాసుకునేవాడు. ఆ నల్లటి రాయి ఏంటో తెలుసా...? అదే "గ్రాఫైట్". గ్రాఫైట్ నుండి పెన్సిల్...! పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో తయారు చేస్తారు. గ్రాఫైట్ అనేది కర్బన సమ్మేళనం, వజ్రం కూడా కర్బన పదార్థమే. అయితే వజ్రానికి ఉన్న కఠినత్వం గ్రాఫైట్‌కు లేదు.
రోజులు అలా గడుస్తుండగా... డిక్సన్‌కు ఓ చిన్న ఆలోచన వచ్చింది. ఆ గ్రాఫైట్ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదం లాంటి పదార్థాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది కానీ... కాస్త బరువుగా ఉండి రాసేందుకు అంత వీలుకాలేదతడికి. అంతేగాకుండా చేతులు నల్లగా అయ్యేవి. దీంతో చాలా ప్రయోగాలు చేసిన తరువాత కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
ఒక సన్నటి కొయ్యముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంధ్రాన్ని చేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను అందులో నింపి, బాగా ఎండిన తర్వాత రాశాడు డిక్సన్. అంతే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అద్భుతంగా రాస్తోంది
అది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటక పోవడం, వేగంగా రాయడం లాంటి లక్షణాలు కలిగిన ఆ పెన్సిల్‌ను చూసి చాలా సంతోషపడ్డాడు డిక్సన్... ఇదీ పిల్లలు మన పెన్సిల్ పుట్టుక కథ...! ఇకపోతే...
మొదట్లో పెన్సిళ్లు గుండ్రంగా వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో గురైన పెన్సిల్ రకరకాల ఆకారాల్లో వాడుకలోకి వచ్చింది.
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...