లావా : భూగర్భం లోపల ఉన్న కరిగిన శిలాద్రవాన్ని మాగ్మా అంటారు. ఉపరితలం మీదకి వచ్చిన మాగ్మాని ‘లావా’ అంటారు. అగ్నిపర్వతాలు బ్రద్దలైనపుడు, అగ్నిపర్వత గర్భభాగాన గల మాగ్మా విపరీతమైన వేడిమి మరియు వత్తిడితో, అగ్నిపర్వత ముఖభాగము ద్వారా బయటకు నెట్టివేయబడుతుంది. ఈ మాగ్మాయే వాతావరణంలో వచ్చినపుడు లావా అని పిలువబడుతుంది. ఈ లావా గాఢమైన ద్రవము. దీని ఉష్ణోగ్రత 700 నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు వుంటుంది. ఈ లావాయే చల్లబడి శిలలుగా రూపాంతరం చెందుతుంది. .లావాలోని వాయువులు పైకి వచ్చేటప్పుడు లావా ఉపరితలంలో నురుగువంటి పదార్థం చల్లారి, ఘనీభవించి, తేలికైన పదార్థలుగా ఏర్పడుతుంది. దీనిని ప్యూమిస్ అంటారు.
చల్లబడిన కొంత లావా భూబాగము సారవంతమైన భూమిగా మారుతుంది . ఈ ప్రాంతాలలో చక్కని పంటలు పండించగలరు . అందుకే అగ్నిపర్వతాల లావావల్ల ప్రమాధము ముంచిఉన్నా ఆ అగ్నిపర్వత ప్రాంతాలలో ప్రజలు నివసించడానికి ఇస్టపడుతూ ఉంటారు .
- ======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...