Tuesday, August 02, 2011

దీపం వెలుగులొ వస్తువు పరిమాణం కన్నా దాని నీడ ఎందుకు పెద్దదిగా ఉంటుంది?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : దీపం వెలుగులొ వస్తువు పరిమాణం కన్నా దాని నీడ ఎందుకు పెద్దదిగా ఉంటుంది?

జ : ===> కాంతి జనకానికి అంటే దీపానికి దగ్గరగా ఉన్నపుడే దాని నీడ పెద్దదిగా కనిపిస్తుంది. బిందువు పరిమాణంలొ ఉండె కాంతి జనకం ( point source )నుంచి వచ్చే కిరణాలు అపసరన (Divergent ) మార్గంలొ నలుదిశలకు వ్యాపిస్తుంటాయి సరళ రెఖాల్లొ ప్రయాణించె ఈ కాంతి కిరణాలను యెదైన కాంతి నిరొదక (opaque ) వస్తువు అడ్డుకుంటె, కిరణాలు ఆ వస్తువు గుండా ప్రసరించలెవు కాబట్టి వస్తువు వెనుక చీకటి ప్రదెశం ఎర్పడుతుంది అదే వస్తువు నీడన్న మాట.

కాంతి జనకం వస్తువు నుంచి చాల దూరంలొ ఉంటె వస్తువును చేరుకునే కిరణాలు ఒక దానితొ మరొకటి సమాంతరంగా ఉంటాయి.దాంతొ ఎర్పడె నీడ,ఆ వస్తువు పరిమాణం లొనే ఉంటుంది.అదే బిందు పరిమాణం లో ఉండె కాంతి జనకం వస్తువుకు దగ్గరగా ఉందనుకొండి.కాంతి జనకాన్ని , వస్తువు చివర్లను కలిపే ఎక్కువ కోణం గల కాంతి కిరణాలు మాత్రమె వస్తువును దాటుకొని పొతాయి .కాబట్టి నీడ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. వస్తువు కాంతి జనకం దగ్గరకు వచ్చే కొద్ది నీడ పరిమాణం పెద్దదిగా అవుతూ ఉంటుంది.

Source : http://hiphop-harry.blogspot.com/
  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...