Tuesday, August 02, 2011

క్యారెటు(నాన్యత) అంటె ఎమిటి?, What is carat(purity)?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
Q) :బంగారం గురించి చెప్పెటప్పుడు 24 క్యారెట్లు అంటుంటారు.అసలు క్యారెటు అంటె ఎమిటి?, What is carat(purity)?

(A)===> అడుగు,ఫౌన్స్,ఫారన్ హీట్ వంటి ప్రమాణాలు చాలవరకు బ్రిటన్ రాచరిక వ్యవస్థ కారణంగా అచరణలోకి వచ్చాయి. 24 క్యారెట్లు కూడ ఓ మెరకు అటువటిందే ప్రాచిన బ్రిటన్ దెశంలో గ్రెయిన్,క్వార్ట్ అనే నాణెలు ఉండెవి ఒక గ్రెయిన్ కి నాలుగు క్వార్ట్ లు సమానం.నాలుగు గ్రెయిన్లు చెయాలంటే ఒక క్యారెట్ బంగారం కావలని అనుకునేవారు.అప్పట్లొ వర్తకులు,సంపన్నులు ఏటా 24 క్యారెట్ల విలువైన నాణెలను రాజుగారికి అందించడం ఒక ఆనవాయితిగా ఉండేది.దీనికి పూర్తిగా శుద్దిగా ఉండె బంగారాన్ని వాడేవారు. క్రమేపి బంగారం స్వచ్చతకు 24 క్యారెట్లు అనేది బంగారం గీటురాయిగ మారింది. ప్రస్తుతం ఒక క్యారెట్ ఒక నిష్పత్తి మాత్రమె. ఒక వస్తువులొ 100 శాతం బంగారం మూలకం ఉందనుకొండి అప్పుడది 24 క్యారెట్ల బంగారపుదని అర్థం అదే 75% మాత్రామే ఉంటె 18 క్యారెట్లదని , 50% శాతమైతే 12 క్యారెట్లదని అంటారు. అయితే 24 క్యారెట్ల బంగారం శుద్దమైనదైనా దానిని అభరణాలుగ మల్చడానికి వీలుకాదు. అందుకె అందులో కొంచెం రాగిని కలుపుతారు. దాంతొ అభరణాల క్యారెట్ విలువ 24 క్యారెట్ల కన్నా కొంచెం తక్కువగ ఉంటుంది.


మూలము : http://hiphop-harry.blogspot.com/
  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...