Saturday, August 20, 2011

గాజును చేసేదెలా?, How do we make glass ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



ప్రశ్న: ఇసుక నుంచి గాజును తయారు చేస్తారని చదివాను. ఎలా చేస్తారు?

జవాబు: గాజు తయారీలో క్వార్ట్జ్‌ ఇసుక, సోడా తగుపాళ్లలో ఒక పెద్ద పాత్రలో ఉంచి ఆ మిశ్రమాన్ని యంత్రాల సాయంతో మెత్తని పొడిగా చేస్తారు. ఈ పొడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడు నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన మెత్తని, జిగురులాంటి పదార్థంగా మారుతుంది. అంటుకుపోయే స్వభావం ఉన్న ఈ పదార్థాన్ని సుమారు 1000 డిగ్రీల సెంటిగ్రేడు వరకు చల్లారుస్తారు. ఈ దశలో మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ కలుపుతారు. దీని వల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోయి, స్వచ్ఛమైన పారదర్శకత కలిగిన గాజు పదార్థం తయారవుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని లోహపు ఆక్సైడులను కలపడం ద్వారా కావలసిన రంగులు వచ్చేలా కూడా చేయవచ్చు. చల్లార్చిన గాజు పదార్థాన్ని అచ్చుల యంత్రాల సాయంతో కావలసిన మందం కలిగిన గాజు పలకలు, దిమ్మలు, కడ్డీల రూపంలోకి మలుస్తారు. ఆ తర్వాత మెరుగు పెట్టడం, చెక్కడం అదనంగా చేస్తారు.

-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...