ప్రశ్న: నాణేలు సరైనవో, నకిలీవో ఎలా తెలుస్తుంది?
-ఎమ్. శిరీష, 9వ తరగతి, మెదక్
జవాబు: నాణేలు సరైనవో, నకిలీవో తెలుసుకోడానికి 'కాయిన్ టెస్టర్' అనే యంత్రాన్ని వాడతారు. ఇందులో ఉండే అయస్కాంత ధ్రువాల మధ్య నుంచి నాణేలు ప్రయాణించే ఏర్పాటు ఉంటుంది. ఆ ధ్రువాల మధ్య ఉండే అయస్కాంత క్షేత్రాన్ని, అయస్కాంత బలరేఖలను నాణేలు ఖండించడం వల్ల వాటిలో ఆవర్తన విద్యుత్ ప్రవాహాలు (Eddy currents) ఉత్పన్నమవుతాయి. వీటి కారణంగా నాణేల వేగం మారుతుంది. అలాగే నాణేలు కాంతి శక్తిని ఉద్ఘారించే డయోడ్ల (LED) గుండా కూడా ప్రయాణిస్తాయి. అక్కడ ఉండే కాంతి గ్రాహకాలు (light sensors) ఆ నాణేల వేగం, వ్యాసాలను కొలుస్తాయి. సరైన నాణేల వేగం, వ్యాసాల విలువలు ముందుగానే ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉంటాయి. నాణేలు నకిలీవైతే ఏర్పడే సున్నితమైన మార్పులను యంత్రం గుర్తించగలుగుతుంది. నకిలీ నాణేలు అదే యంత్రంలో వేరే అరలోకి చేరే ఏర్పాటు ఉంటుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...