ప్రశ్న:మొబైల్, డిజిటల్ కెమేరాలకు పక్కన 1.3 Mpxలాంటి సంఖ్యలు ఉంటాయి. అవేంటి?
-వి. వసంత, రేపల్లె (గుంటూరు)
జవాబు: మొబైల్, డిజిటల్ కెమేరా ఎంత విశదంగా ఫొటోలు తీయగలదో సూచించే సంఖ్యలే ఇవి. వీటిలో Pxఅనేది పిక్చర్ ఎలిమెంట్(picture element)కి సంక్షిప్త రూపం. దీన్నే పిక్సెల్ అని కూడా అంటారు. డిజిటల్ కెమేరాలకు, పూర్వపు ఫిల్మ్ కెమేరాలకు తేడా ఉంది. ఫిల్మ్ కెమేరాలలో రసాయనిక రేణువుల సాంద్రత బొమ్మ స్పష్టతకు కొలమానంగా ఉండేది. డిజిటల్ కెమేరాల్లో ఫిల్మ్‌లు ఉండవు. కటకం (లెన్స్) వెనుక ఓ ఫలకం (plate)ఉంటుంది. దీనిపై సూక్ష్మమైన కాంతివిద్యుత్ గ్రాహకాలు(Photo electric receptors) ఉంటాయి. ఇవి ఆ ఫలకంపై అడ్డం, నిలువు వరసల్లో అనేకం ఉంటాయి. ఒక చదరపు సెంటీమీటర్ ప్రాంతంలో 13 లక్షల గ్రాహకాలు ఉంటే ఆ కెమేరా సామర్థ్యాన్ని 1.3 Mpxఅని సూచిస్తారు. అంటే మెగా పిక్సల్స్ అని అర్థం. అలాగే 32 లక్షల గ్రాహకాలు ఉంటే 3.2 మెగా పిక్సల్స్‌గా పేర్కొంటారు. వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ కెమేరాతో తీసే ఫొటోలు అంత స్పష్టంగా ఉంటాయి.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...