Tuesday, August 02, 2011

ద్వని ఎందుకు ప్రయాణించదు?,Why cann't sound travel empty(vaccum)space



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


(Q)శూన్య ప్రదెశంలో కాంతి పయనిస్తుంది.కాని ద్వని ఎందుకు ప్రయాణించదు?,

(A)===> ద్వనిని యాంత్రికరంగం ( Mechanical wave )అనీ,కాంతిని విద్యుదయస్కంత తరంగం (Electro magnetic wave )అనీ అంటారు.యాంత్రిక తరంగాలు బౌతికంగా ఉండె ద్రవ్యకణాల ప్రకంపనాల ద్వారానే పయనిస్తాయి. ఘన, ద్రవ, వాయు పదార్థాలాలోని కణాలు కంపించడం వలనే ద్వని శక్తి ఒక కణం నుంచి మరొ కణానికి యాంత్రిక తరంగ రూపంలో పయనిస్తుంది. అందువల్ల ద్వని ప్రసరించడానికి ఒక మాద్యమం అవసరం ఎంతైనా ఉంది.
ఇక విద్యుదావేశాలు కంపనం చెందితే వాటి చుట్టూ విద్య్త్తుత్తు, అయస్కాంత క్షెత్రాలు ఉత్పన్నమవుతాయి. ఆ క్షెత్రాలు ఒకదానితో మరొకటి లంబంగా ఉండే సమతాలాల్లో డోలనాలు ( Oscillations) ) చేస్తూ ఉంటాయి. ఆ డోలనాల మూలంగా ఉత్పన్నమయ్యే కాంతిలాంటి విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరించాడానికి మాద్యమం అవసరం లేదు. కాబట్టి అవి శూన్యంలో కూడ పయనిస్తాయి. మన కంటికి కనిపించే కాంతి మాత్రమే కాకుండ ,కనిపించని పరారుణ ( Infrared ),అతి నీలలోహిత ( Ultra Violet )కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ రే కిరణాలు, గామ కిరణాలు కూడ విద్యుదయస్కాంత తరంగాలే.. వీటి పయణానికి ఏ మాద్యమం అవసరం లేదు.ఇవి శూన్యంలొ కూడ పయనిస్తాయి.


మూలము : http://hiphop-harry.blogspot.com/
  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...