ప్ర : మేము ఇంటిల్లపాది చేపల కూర తింటాము . చేపలు వండేవారి , తినేవారి చేతులు కంపు పోయేందుకు కొన్ని చిట్కాలు చెప్పగలరా?
జ : చేపలను తినడానికి ఇస్టపడేవారు కూడా భరించలేని వాసన చేపలలో ఉంటుంది . చేతులతో పట్టుకున్నా , వంట చేసినా చేపల వాసన అంత త్వరగా వదలదు . ఆ వాసన వదిలించుకునేందుకు ఇంటిలోని పదార్ధాలే చాలు .
- వాటిలో ముఖ్యమైనది నిమ్మ . నిమ్మ రసముతో చేతులు కడుగుకున్నా , నిమ్మ చెక్కలతో చేతులు తుడుచుకున్నా చేపలవాసన వదులుతుంది .
- గిన్నెలు కడిగేందుకు ఉపయోగించే పొడిని ద్రవముగా చేసి దానికు ఒక స్పూన్ ఉప్పును కలిపి దానితో చేతులు కడుగుకుంటే చేపల వాసన పోతుంది.
- వంటసోడా కి నీటిని కలిపి ముద్దలా తయారుచేసి ఆ ముద్దతో చేతులు కడుక్కోవాలి .. వాసన పోతుంది .
- సారా చేతుల మీద చల్లుకొని దానిని నీటితో కడుక్కుంటే చేపల వాసన వదులుతుంది .
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...