ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
శ్రీకాకుళం అను పేరుతో రెండు ఊర్లు ఉన్నాయి. ఒకటి(1) కృష్ణా జిల్లలో దివితాలుకా లోని చిన్న గ్రామము . రెండు(2) శ్రీకాకుళము జిల్లాలో జిల్లాకేంద్రము అయిన శ్రీకాకుళం పట్టణము .
(1)-శ్రీకాకుళం లోని " శ్రీ" అంటే లక్ష్మి , సంపద , శుభప్రదము అని అర్ధాలు .
" కా" అనే ద్రావిడ పదానికి అర్ధము : ఆధారము , రక్షకుడు , ప్రభువు , దైవము .
" కుళం " అంటే కొలను అని అర్ధము .
ఫలితార్ధము = శుభప్రదమైన దేవుని కొలను . ఇది కృష్ణానదీ తీరము లో ఉన్న ఆంధ్రనాయక స్వామి ఆలయము . ఈ స్వామినే తెలుగు రాయడు , తెలుగు వల్లభుడు అని అంటారు .
(2)- పూర్వము ఆంగ్లేయ పరిపాలన కాలములో శ్రీకాకుళం ప్రాంతాన్ని ఖజానా నిలువా ఉంచే (ఠంక శాల) ప్రదేశము(Treasury) గా వాడేవారు . ఇక్కడ నాణేల సంచులు మూటలు కట్టి దాచేవారని. సంభందిత అధికారులు వచ్చి మూటలు విప్పి లెక్కించేవారని అంటారు . ఇక్కడ హిందీ లో సిక్కా అంటే నాణెం (డబ్బు)सिक्का=Coin అని . కుళా అంటే खुला = Open అని అర్ధము . కావున అర్ధాన్ని బట్టి .. ఈ ప్రాంతాన్ని సిక్కాకోల్ గా పిలిచేవారని అంటారు. కాలక్రమేనా... సిక్కాకోల్ '' సిక్కోల్ '' గాను , తదుపరి '' శ్రీకాకుళం '' గాను నామకరణము చేయబడినది .'' శ్రీ'' అంటే లక్ష్మి (Money) , ''కా'' అంటే దైవము , " కుళం " అంటే కొలను లేదా ప్రవాహము అని అర్ధము. శ్రీకాకుళం , జిల్లా ముఖ్యపట్టణము మరియు జిల్లా పేరు . ఈ జిల్లాలో 38 మండళాలు , 5 మున్సిపాలిటీలు ఉన్నాయి
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...