వెనిల్లా అనేది ఒక రకమైన సువాసన (flavouring) ద్రవ్యము . వెనిల్లా మొక్కలను సుమారు 1500 లో మెక్షికో లో గుర్తించడము జరిగినది . ఈ మొక్క యొక్క పువ్వులు , కాయలు , పండ్లు మంచి వాసన కలిగి ఉంటాయి. ప్రపంచములో అన్ని దేశాలలో ఇపుడు దీనిని పండిస్తున్నారు .
వెనిల్లా పేరు ఐస్ క్రీములప్పుడు మాత్రమే విని ఉంటారు . అంతకు మించి వెనిల్లా గురించిగాని , దాని విశేషాల గుఎఇంచి గాని చాలా మందికి తెలియదు . వెనిల్లా రుచితో పాటు ఇతర విధాలుగా కూడా వినియోగపడుతుంది .
- సువాసనలను వెదజల్లగలిగినది వెనిల్లా ఫ్రిజ్ లో పెట్టే పదార్ధముల వల్ల వచ్చే వాసనలను తరిమివేయగలదు . ఒక కాటన్ ఉండను వెనిల్లాలో ముంచి ఫ్రిజ్ లోపల అంతా తుడిస్తే చెడువాసనలు పోతాయి.
- కీటకాలను పారద్రొలేశక్తి వెనిల్లాకు ఉంది . వెనిల్లాలో గుడ్డ ముంచి శరీరము మీద తుడుచుకుంటే ఆ వాసనకు దోమలు రావు .
- కాలిన గాయాలకు వెనిల్లా రాస్తే చల్ల బరుస్తుంది . గాయము త్వరగా మానేలా చేయగలదు .
- మణికట్టు ప్రాంతాలలో వెనిల్లా చుక్కలు రాసుకుంటే దానివాసన చాలా సేపు నిలిచిఉంటుంది . పెళ్ళి , పేరంటాలలో అతిధులకు రాయవచ్చును .
- ఇంటికి పెయింటింగ్స్ వేసేటప్పుడు ఆ పెఇంట్స్ ఘాటైన వాసనకు విరుగుడు గా వెనిల్లా ను వాడవచ్చును . పెయింట్ లో ఒక స్పూన్ వెనిల్లా కలిపితే పెయింట్ ఘాటు తగ్గుతుంది .
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...