ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: భూమి ఎప్పుడు, ఎలా పుట్టింది? వయసెంత?
జవాబు: భూమి పుట్టలేదు. ఏర్పడింది. ఆధునిక విశ్వ సిద్ధాంతాల (cosmology) ప్రకారం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటం (big bang) ద్వారా శక్తి రూపాంతరం చెంది విశ్వం (universe)గా మారింది. ఆ విశ్వం క్రమేపీ విస్తరిస్తున్న క్రమంలో నెబ్యులాలు అనే మేఘాలుగా పదార్థం క్రోడీకరించుకుంది. ఆ నెబ్యులాలే నక్షత్ర రాశులుగా మారాయి. ప్రతి నక్షత్రం మొదట్లో ఓ వాయు అగ్ని పళ్లెంలాగా ఏర్పడింది. అలాంటిదే సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండల పళ్లెం (solar disc) రూపుదిద్దుకుంది. అది తన చుట్టూ తాను తిరిగే క్రమంలో అపలంబ బలం(centrifugal force) వల్ల అంచుల్లో ఉన్న ద్రవ్యం గ్రహాలుగా, మధ్యలో భాగం సూర్యుడిగా మారాయి. కాబట్టి భూమి కూడా ఆ సౌరమండల పళ్లెంలో ఒక భాగమే. అంటే భూమి, సూర్యుడు కూడా సోదరులు మాత్రమే. భూమి వయస్సు సుమారు 550 కోట్ల సంవత్సరాలు. ఇది కూడా మొదట్లో సూర్యుడిలాగే స్వయం ప్రకాశకం(self luminiscent). కానీ కేంద్రక సంలీన(nuclear fussion)కు కావలసిన ఉదజని (హైడ్రోజన్) తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని ఆగిపోయి చల్లబడి క్రమేపీ ప్రస్తుత స్థితికి చేరుకుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...